ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తికంటే మనవల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ .     చెమటోడ్చి సాధించిన ఫలితం ముందు సర్వసౌఖ్యాలూ దిగదుడుపే.     మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది.      ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. ఆలోచనల ఫలితమైనా అంతే     

దేవాలయలు

మా ఊరు ...అంటే పొన్నూరు (గుంటూర్ జిల్లా లో ఉంది)
ఇప్పుడు మా ఊరులో ఉన్న దేవాలయలు గురించి చెబుతాను

మా ఊరులో ఉన్న దేవాలయములలో ముఖ్యమైనవి.సహస్రలింగేశ్వరస్వామి దేవాలయం,భావన్నారాయణ స్వామి దేవాలయం,తోట్లమ్మ తల్లి దేవాలయం,పాత శివాలయం ముఖ్యమైనవి.

ముందుగా సహస్రలింగేశ్వరస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము

సహస్రలింగేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణములో అనేక ఆలయాలు కొలువు దేరి ఉన్నాయి .అవి శివాలయం,
వీరాంజనేయ స్వామి ఆలయం, దశావతారాల ఆలయం,గరుత్మంత స్వామి ఆలయం, కాలభైరవాలయం,
వెంకటేశ్వరస్వామి ఆలయం.

శివాలయం :
ఈ ఆలయంలో ఉన్న ప్రధాన ఆలయం చుట్టూ సహస్ర లింగాలు కొలువు దేరి ఉండటం వలన ఈ ఆలయానికి
సహస్రలింగేశ్వరస్వామి  ఆలయం అని పేరు   వచ్చింది. ప్రధాన  ఆలయంలో  శివలింగాకారానికి  ఎదురుగా
విఘ్నేశ్వరాలయం ఉంటుంది.శివలింగాకారానికి వెనుక భాగాన శివుడు విగ్రహ రూపంలో  దర్శనమిస్తాడు.ఈ
ఆలయముఖద్వారం వద్ద పార్వతీదేవిఅమ్మవారు ఒకవైపు,వీరభద్ర స్వామి,భధ్రకాళిఅమ్మవారు రెండవ వైపున
దర్శనమిస్తారు.ముఖద్వారం దాటి ముందుకు వస్తే నందీశ్వరుడు 10అడుగుల ఎత్తు ఉన్న విగ్రహ రూపంలో
కులువు దేరిఉంటాడు.నందీశ్వరునికి ఒక ప్రక్కన నవగ్రహాలు ఉన్నాయి.కార్తీక మాసంలో ఈ ఆలయంలో
భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది.



వీరాంజనేయ స్వామి ఆలయం:
ఈ ఆలయంలో 24 అడుగుల ఎత్తు ఉన్న ఏకశిలా విగ్రహ రూపంలో ఆంజనేయ స్వామి దర్శమిస్తారు.ఈ విగ్రహం
యడ్లపాడు లో తయారు చేయబడింది .24 అడుగుల భారీ విగ్రహాన్ని ఒకే రాతితో మలచడం అనేది ఇక్కడ
ప్రత్యేకంగా చెపుకోవచ్చు.1961 లో విగ్రహ ప్రతిష్ట జరిగినది.ఆలయం లోపలికి ప్రవేశించగానే ఈ 24 అడుగుల వీరాంజనేయ స్వామి వారి భారీ రూపం మనకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.



గరుత్మంత స్వామి ఆలయం:
ఈ ఆలయంలో 27 అడుగుల ఎత్తు ఉన్న ఏకశిలా విగ్రహ రూపంలో గరుత్మంత స్వామి వారు దర్శనమిస్తారు.
ఈ విగ్రహం కూడా యడ్లపాడు లో తయారు చేయబడిన ఏకశిలా విగ్రహమే .1961 లో విగ్రహ ప్రతిష్ట జరిగినది.


చరిత్ర : వీరాంజనేయ స్వామి, గరుత్మంత స్వామి వార్ల విగ్రహాలను గుంటూర్ జిల్లా యడ్లపాడు మండలములో
తయారు చేశారు .గరుత్మంత స్వామి వారి విగ్రమ్ 30 అడుగులు ఉండి శ్రీదేవి ,భూదేవి ,విష్ణుమూర్తి వారు
గరుత్మంత స్వామి భుజాల మీద ఉండే విధంగా విగ్రహం తయారు చేశారు.కానీ యడ్లపాడు నుండి పొన్నూరు కి
విగ్రహం చేరే సమయంలో చేబ్రోలు వద్ద విగ్రహంపైన ఉన్న దేవతామూర్తుల ప్రతిరూపాలు విరిగినట్లు చెబుతారు.
ఆ తరువాత ఆ శిల్పి ఆ విగ్రహంని వెనుకకు తెప్పించి గరుత్మంత స్వామి భుజాల మీద ఉన్న దేవతామూర్తులను
నాగు పాములగా మలిచారు.ఇలా చేయడం వల్ల స్వామి వారి విగ్రహం ఎత్తు 27 అడుగులకు వచ్చింది.శ్రీదేవి,
 భూదేవి,విష్ణుమూర్తి ల విరిగిన ప్రతిరూపాలను  దశావతారాల ఆలయం లో ఉంచిన్నారు.

వెంకటేశ్వరస్వామి ఆలయం:
వెంకటేశ్వరస్వామి ఆలయంని  ఈ మధ్య తిరుపతి దేవాలయం సహాయంతో నిర్మించిన్నారు.ఆలయం చాలా
ప్రశాతంగా ఉంటుంది.ఇక్కడ వేంకటేశ్వర స్వామి వారు గోదాదేవి,పద్మావతి అమ్మవార్ల సమేతంగా మనకు
దర్శనమిస్తారు.

కాలభైరవాలయం :

శివాలయం ,దశావతారాల ఆలయం ల మధ్య కాలభైరవాలయం ఉన్నది .

దశావతారాల ఆలయం:
ఈ ఆలయంలోని   ప్రధాన ఆలయం లో విష్ణుమూర్తి స్వామి దర్శనమిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ మనకు
శ్రీ కృష్ణ వతరం ,రామావతారం ,కల్కివతారం, బుద్ధ అవతారం ,వరాహవతరం ,నరసింహావతారం,మత్స్యావతారం,
వామనావతారం,సత్యనారాయణ స్వామి అవతారం,కూర్మావతారం,ల రూపాలలో విష్ణుమూర్తిస్వామి వారు
భూధేవి,శ్రీధేవి అమ్మ వార్ల సమేతంగా మనకు దర్శనమిస్తారు.ముఖద్వారం దాటి ముందుకు వస్తే గరుత్మంత స్వామి దర్శనమిస్తారు.

భావన్నారాయణ స్వామి దేవాలయం

పొన్నూరులో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి గుడి కలదు.ఈయనను సాక్షి భావనారాయణ స్వామి అని కూడా అంటారు.ఇదే ఆలయప్రాంగణమున శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం,శ్రీ కాశీవిశ్వేశ్వరాలయము,శ్రీ విశాలాక్ష్మి అమ్మవారి ఆలయాలు గలవు.